by సూర్య | Thu, Jul 11, 2024, 05:18 PM
సింగరాయకొండ జాతీయ రహదారి సమీపంలో కొద్దిరోజు ల క్రితం జరిగిన యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితు రాలిని పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. వివరాలను సీఐ రంగనాథ్ ఎస్‌ఐ టి. శ్రీరాంతో కలిసి బుధవారం వె ల్లడించారు. బాపట్ల జిల్లా అమర్తలూరుకు చెందిన దేవరకొండ గోపి (35) ఈనెల 6వతేదీ రాత్రి జాతీయ రహదా రిపై ఉన్న ఏఎన్‌ఆర్ హోటల్ పక్కన హత్యకు గురయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెనాలి మఠంబజారుకు చెందిన మొగిలి లక్ష్మి, మరో నిందితుడు బుస్సా నాగరాజు కలిసి గోపిని హత్య చేసినట్లు తేలింది. దీంతో లక్ష్మిని బుధవారం అరెస్టు చేశారు. నాగరాజు కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
Latest News