రెవెన్యూ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపడుతాం

by సూర్య | Thu, Jul 11, 2024, 05:14 PM

వైసీపీ ప్రభుత్వ ఐదేళ్లపాలనలో గురజాల నియోజకవర్గంలో జరిగిన భూ ఆక్రమణలపై సిట్‌తో దర్యాప్తు చేయిస్తామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం పిడుగురాళ్ల ఆర్‌అండ్‌బీ బంగ్లాలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ......  గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో భూ ఆక్రమణలు ఎన్నో జరిగా యని, రెవెన్యూ రికార్డులను మార్చేసి రుణాలు పొందిన వైనంపై సిట్‌తో దర్యాప్తు జరిస్తామని యరపతినేని అన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రే షన్‌ శాఖలో ఎవరు అవినీతికి పాల్పడ్డారో గుర్తిస్తామన్నారు. టిడ్కో గృహాలు 80 శాతం టీడీపీ హయాంలోనే పూర్తిచేసినా ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏమీ పట్టించుకోలేదన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని, ఉచిత ఇసుక పాలసీతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకా శాలు లభించడం ఆయా కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నార న్నారు. సమావేశంలో యరపతినేని నిఖిల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కొత్త వెంకట సుబ్బారావు, పులుకూరి కాంతారావు, పాండురంగ శ్రీను, వడ్డవల్లి సర్వేశ్వరరావు, గండికోట వెంకటేశ్వర్లు, వున్నం వెంకట్రావు, ఎల్వీఆర్‌, జొన్నలగడ్డ శ్రీను, సయ్యద్‌ అమీర్‌అలి, కటకం అంకారావు, సైదా, శ్రీను, రమేష్‌, చిన్న, ఖాశింసైదా తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
విజయవాడలో డ్యాన్సర్ అనుమానాస్పద మృతి.. ఆ రాత్రి ఏం జరిగింది, గదిలో ముగ్గురు Wed, Oct 30, 2024, 10:56 PM
ఏపీలో మందుబాబులకు అదిరే శుభవార్త.. ధరలు తగ్గింపు, కొత్త బ్రాండ్లు వస్తున్నాయి! Wed, Oct 30, 2024, 10:50 PM
పవన్ కళ్యాణ్ ప్రతిపాదన.. వెంటనే ఓకే చెప్పిన సీఎం చంద్రబాబు Wed, Oct 30, 2024, 10:46 PM
సీఎం చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్ బాబా.. అసలు కారణం ఇదే! Wed, Oct 30, 2024, 10:42 PM
అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్ Wed, Oct 30, 2024, 10:12 PM