by సూర్య | Thu, Jul 11, 2024, 05:14 PM
అత్యంత వెనుకబడిన అనంతపురం, సత్య సాయి జిల్లాల అభివృద్ధికి సహకరించాలని బీసీ సంక్షేమశాఖా మంత్రి సవితను ఎమ్యెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోరారు. వీరి ఆహ్వానం మేరకు బుధవారం మంత్రి అనంతపురంలోని పీవీకేకే కళాశాలకు విచ్చేశారు. ఈ సందర్భం గా మంత్రిని వారు సన్మానిం చారు. పుట్టపర్తిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల అధినేత పల్లెక్రిష్ణకిశోర్, టీడీపీ నాయకులు ఉన్నారు.
Latest News