by సూర్య | Thu, Jul 11, 2024, 05:13 PM
ఆర్టీసీ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహయ సహకారాలను అందించేలా కృషి చేస్తామని పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. బుధవారం పార్వతీపురం డిపో నుంచి విజయవాడ, విశాఖపట్నాలకు వెళ్లేందుకు సూపర్ లగ్జరీ, పల్లె వెలుగు బస్సు సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలకు వెళ్లేం దుకు గత ప్రభుత్వం హయాంలో బస్సులు తక్కువగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడడం పలుసార్లు పత్రికల్లో రావడం చూసానని తెలిపారు. ప్రజలు కష్టాలు తెలిసిన ప్రభుత్వం కావడంతో రాష్ట్ర పగ్గాలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే నూతన బస్సుల సర్వీసులను అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిపోమేనేజర్ కనకదుర్గా, టీడీపీ నాయకులు, బి.సీతారామ్, తదితరులు పాల్గొన్నారు.
Latest News