by సూర్య | Thu, Jul 11, 2024, 05:13 PM
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ సమీపంలోని తన ఇంటి వద్ద ఉంచిన తన కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి రాళ్ల తో ధ్వంసం చేశారని నెల్లిమర్లకు చెందిన జనసేన నాయకుడు రవ్వా నాగేంద్ర వర్మ (నాని) నెల్లిమర్ల పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. తన కారు అద్దాలను ఉద్దేశపూర్వకంగా గుర్తు తెలియని వ్యక్తులు బద్దలు కొట్టారని, నిందితులను తక్షణమే గుర్తించి వారికి చట్టపరంగా కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు. జనసేనలో నాయకుడిగా తనకు గుర్తింపు లభిస్తుందన్న అక్కసుతోనే తన వాహనాన్ని అర్ధరాత్రి పూట పాడుచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి పహారా వేయాలన్నారు.
Latest News