by సూర్య | Thu, Jul 11, 2024, 05:11 PM
పామర్రు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ప్రజలకు సేవకుడిగా ఉంటా. ఎన్టీఆర్ స్ఫూర్తితో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తా అని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక బుధవారం పెద మద్దాలి గ్రామానికి విచ్చేసిన ఆయనకు టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. కొండాయపాలెం నుంచి గ్రామంలోకి విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. సూపర్‌సిక్స్ పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టీడీపీ గ్రామ నేతలు అడుసుమిల్లి శ్రీను, మిక్కిలినేని ప్రభాకర్, యేసురత్నం, పసుపులేటి శ్రీను, కొండా ప్రసాద్, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కుదర వల్లి ప్రవీణ్‌చంద్ర, ఏఎంసీ మాజీచైర్మన్ వల్లూరిపల్లి గణేష్, మండపాక శంకర్‌బాబు పాల్గొన్నారు.
Latest News