by సూర్య | Thu, Jul 11, 2024, 05:10 PM
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరులను బుధవారం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సీఎండీ కృష్ణకుమార్, బందరు ఎంపీ బాలశౌరిల బృందం దర్శించుకుంది. వీరికి ఆలయ ఈవో కేఎస్ రామారావు, అర్చక బృందం సాదర స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రం తదితరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను గురించి ఈవో రామారావు వారికి వివరించారు. అనంతరం బాలశౌరి విలేకరులతో మాట్లాడుతూ, బీపీసీఎల్ బృందం రాకను గురించి చెప్పారు.
Latest News