దుర్గమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు

by సూర్య | Thu, Jul 11, 2024, 05:09 PM

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన కానుకల లెక్కింపు కార్యక్రమంలో 20 రోజులకుగాను రూ.3,36,59,796లు నగదు రూపేణా సమకూరింది. సగటున రోజుకు రూ.16,82,989ల మేరకు కానుకలు వచ్చినట్టు దేవస్థానం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బంగారం 436 గ్రాములు, వెండి 6.060 కిలోలు కానుకల రూపేణా సమకూరింది. యూఎ్‌సఏ డాలర్లు 1300, యూకే ఫౌండ్లు 85, ఆస్ట్రేలియా డాలర్లు 7, ఓమన్‌ రియాల్స్‌ 2.5, కెనడా డాలర్లు 80, యూఏఈ దిర్హమ్స్‌ 295, కువైట్‌ దినార్లు 6.25, ఖతార్‌ రియాల్స్‌ 8, సింగపూర్‌ డాలర్లు 12, సౌదీ రియాల్స్‌ 100, యూరప్‌ యూరోలు 10, మలేషియా రింగేట్స్‌ 118, న్యూజిలాండ్‌ డాలర్లు 70, థాయ్‌లాండ్‌ బట్స్‌ 80, బెహ్రెయిన్‌ దినార్లు 15.5 చొప్పున కానుకల రూపంలో వచ్చాయి. ఆన్‌లైన్‌ ఈ-హుండీ ద్వారా మరో రూ.1,91,787లు ఆదాయం సమకూరింది. కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో కేఎస్‌ రామారావు, దేవదాయశాఖ అధికారులు, దేవస్థానం అధికారులు, ఎస్‌పీఎఫ్‌, పోలీస్‌ సిబ్బంది పర్యవేక్షించారు.

Latest News

 
ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు Wed, Oct 30, 2024, 02:52 PM
జెత్వానీ, ఆమె పేరెంట్స్ నుంచి వాంగ్మూలం సేక‌రించిన‌ సీఐడీ అధికారులు Wed, Oct 30, 2024, 02:34 PM
మున్సిపల్ కమిషనర్ కు దరఖాస్తులు అందజేత Wed, Oct 30, 2024, 01:52 PM
మేదరమెట్ల: ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు Wed, Oct 30, 2024, 01:41 PM
హిందూపురం: పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలి Wed, Oct 30, 2024, 01:38 PM