by సూర్య | Wed, Jul 10, 2024, 02:28 PM
విజయనగరం జిల్లా, బొండపల్లి మండలంలోని ఒంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని కొండపోరంబోకు కొండ నుంచి అనుమతి లేకుండా గ్రావెల్‌ను తరలిస్తున్న ఐదు లారీలతోపాటు రెండు యంత్రాలను రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్‌చేశారు. గ్రీన్‌ఫీల్డ్ జాతీయరహదారి నిర్మాణానికి అనుమతి లేకుండా పదెకరాల విస్తీర్ణంలో గల కొండపోరంబోకు నుంచి గ్రావెల్‌ను కొద్ది రోజులుగా అక్రమంగా తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆర్‌ఐ సతీష్‌తోపాటు సర్వేయర్, వీఆర్వో, సిబ్బందితో ఆ ప్రాంతాన్ని పరిశీలించి గ్రావెల్ తరలిస్తుండగా లారీలు, యం త్రాలను పట్టుకొని పోలీసు స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. భూగర్భ గనులశాఖ ఏడీఏకు అక్రమ రవాణా విషయంపైౖ నివేదిక అందజేసి చర్యలు తీసుకోనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
Latest News