by సూర్య | Wed, Jul 10, 2024, 02:21 PM
ఏపీఎస్‌ఆర్టీసీలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండ్ ఆవరణలోని కర్నూలు-1డిపో గ్యారేజీలో మంగళవారం సాయంత్రం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి రెండు స్టార్‌లైనర్ బస్సులు, నాలుగు కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారని వివరించారు. రెండు స్టార్ లైనర్ బస్సులతో పాటు రెండు సూపర్ లగ్జరీ బస్సులను సైతం కర్నూలు నుంచి బెంగళూరు రూట్‌లో కొనసాగుతాయన్నారు. ఎంపీ నాగరాజు మాట్లా డుతూ అంతేకాకుండా మరో రెండు సూపర్ లగ్జరీ బస్సులను తిరుపతి మా ర్గంలో తిరుగుతాయన్నారు. ప్రతి శని, ఆదివారాల్లో సెలవు దినం కావడంతో సాఫ్ట్ట్‌వేర్ ఉద్యోగులు స్వంత ఊర్లకు రావడానికి ఆర్టీసీ యాజమాన్యం అదనంగా రెండేసీ చొప్పున కొత్త బస్సులను నడపడం అభినందనీయమ న్నారు. కర్నూలు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు మాట్లాడుతు దూరప్రాంత ప్రయాణికులకు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కొత్త బస్సు లను నడుపుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు-1,2 డిపో మేనేజర్లు సర్దార్‌హుస్సేన్, సుధారాణి, డిపో అసిస్టెంట్లు మేనేజర్లు, సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Latest News