by సూర్య | Wed, Jul 10, 2024, 02:22 PM
శ్రీకాకుళం జీటీ రోడ్‌లో స్టేట్‌బ్యాంకు వద్ద తప్పెటగుళ్లు కళాకారులపై, కాళీ వేషధారులపై ఆరుగురు యువకులు మంగళవారం రాత్రి 10 గంటలకు దాడి చేశారు. గుడి వీధిలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు తప్పెటగుళ్లు కళాకారులు, కాళీ వేషధారులు వచ్చారు. అయితే, ఏం జరిగిందో గానీ వీరిపై యువకులు దాడికి పాల్పడడంతో వారి నుంచి తప్పించుకుని రోడ్లపై పరుగులు పెట్టారు. అలాగే, టౌన్ హాల్ సందులో ఉన్న కె.ధర్మారావు అనే టైలరింగ్ షాపులోకి యువకులు చొరబడి అతడిని కొట్టి కత్తెరను తీసుకొని వెళ్లారు. పెద్దపాడుకు చెందిన ఎడ్ల గణేష్‌తో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ కామేశ్వరరావు, ఏఎస్‌ఐ రాంబాబు, తన సిబ్బందితో వెళ్లి గుడి వీధిలోని రివర్ వ్యూ పార్క్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
Latest News