సచివాలయాల్లో జగన్ ఫోటో తొలిగించాలి

by సూర్య | Wed, Jul 10, 2024, 02:20 PM

ఉమ్మడి ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలంలోని గ్రామ సచివాలయాలపై మాజీ సీఎం జగన్‌రెడ్డి ప్రస్తుతం శాసనసభ్యుడిగా మాత్రమే ఉన్నా, ఇంకా ఆయ న బొమ్మలు ఎలా ఉంచుతారని టీడీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించారు. పొన్నలూరు మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం మంగళవారం సాయంత్రం పొన్నలూరులోని మండల పరిషత్‌ సమావేశం హాలులో ఎంపీపీ కె. మాధవ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉప్పలదిన్నె గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్‌ మన్నెం పద్మ తమ గ్రామంలోని సచివాలయంపై ఉన్న జగన్‌ బొమ్మను తొలగించడాన్ని ప్రశ్నించారు. దీనికి ప్రతిగా స్పందించిన టీడీపీ సభ్యులు జగన్‌ బొమ్మలు ఇంకా ఉండటాన్ని ఆక్షేపించారు. వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. దీనికి ఎంపీడీవో కల్పన వివరణ ఇస్తూ గ్రామ సచివాలయాలపై ఉన్న బొమ్మలు కనపడకుండా ఎన్నికల కోడ్‌ సమయం లో కాగితాలు అంటించారని, వర్షం కారణంగా కాగితాలు చిరిగిపోయి జగన్‌ బొ మ్మలు కనిపిస్తున్నాయని, అదేవిధంగా నిర్మాణంలో ఉన్న సచివాలయాలు ఇంకా అప్పగించలేదని సభ్యులకు వివరణ ఇచ్చారు. ఇంకా ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ సీఎం ఫొటోలు, బొమ్మలు తొలగించాలని ఆయా గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఉప్పలదిన్నె గ్రామానికి, అగ్రహా రం మీదుగా కోటపాడుకు బస్సులు నడపాలని ప్రజాప్రతినిధులు కోరారు.

Latest News

 
విజయవాడలో డ్యాన్సర్ అనుమానాస్పద మృతి.. ఆ రాత్రి ఏం జరిగింది, గదిలో ముగ్గురు Wed, Oct 30, 2024, 10:56 PM
ఏపీలో మందుబాబులకు అదిరే శుభవార్త.. ధరలు తగ్గింపు, కొత్త బ్రాండ్లు వస్తున్నాయి! Wed, Oct 30, 2024, 10:50 PM
పవన్ కళ్యాణ్ ప్రతిపాదన.. వెంటనే ఓకే చెప్పిన సీఎం చంద్రబాబు Wed, Oct 30, 2024, 10:46 PM
సీఎం చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్ బాబా.. అసలు కారణం ఇదే! Wed, Oct 30, 2024, 10:42 PM
అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్ Wed, Oct 30, 2024, 10:12 PM