ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రేపు ప్రారంభం కానున్న డిగ్రీ పరీక్షలు

by సూర్య | Wed, Jul 10, 2024, 02:18 PM

విద్యా సంస్థల బంద్‌ నేపథ్యంలో వాయిదాపడిన డిగ్రీ పరీక్షను ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్టు ఆంధ్ర విశ్వవిద్యాలయం కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ టి.చిట్టిబాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల నాలుగో తేదీన బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీహెచ్‌ఎం విద్యార్థులకు రెండు, నాలుగు సెమిస్టర్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, నీట్‌లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆరోజు బంద్‌కు పిలుపు నిచ్చాయి. దాంతో ఏయూ అధికారులు పరీక్షలను వాయిదా వేశారు. ఆ రెండు పరీక్షలను 11న నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్‌ పరీక్షను 11న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెమిస్టర్‌ పరీక్షను అదేరోజు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించనున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Latest News

 
విజయవాడలో డ్యాన్సర్ అనుమానాస్పద మృతి.. ఆ రాత్రి ఏం జరిగింది, గదిలో ముగ్గురు Wed, Oct 30, 2024, 10:56 PM
ఏపీలో మందుబాబులకు అదిరే శుభవార్త.. ధరలు తగ్గింపు, కొత్త బ్రాండ్లు వస్తున్నాయి! Wed, Oct 30, 2024, 10:50 PM
పవన్ కళ్యాణ్ ప్రతిపాదన.. వెంటనే ఓకే చెప్పిన సీఎం చంద్రబాబు Wed, Oct 30, 2024, 10:46 PM
సీఎం చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్ బాబా.. అసలు కారణం ఇదే! Wed, Oct 30, 2024, 10:42 PM
అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్ Wed, Oct 30, 2024, 10:12 PM