వివాహేతర సంబంధంతో భర్తని చంపించిన భార్య

by సూర్య | Wed, Jul 10, 2024, 02:17 PM

వివాహేతర సంబంధం నేపథ్యంలో మచిలీపట్నం లో కట్టుకున్న భర్తనే హత్య చేసిన భార్య, ఆమెకు సహకరించిన వారిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఎస్పీ కార్యాలయం వద్ద ఏఎస్పీ వెంకటేశ్వరరావు నిందితులను హాజరుపరిచారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఏఎస్పీ జి. వెంకటేశ్వరరావు కేసు వివరాలు తెలిపారు. ప్రియుడితో కలిసి కొంత మంది సహకారంతో భర్తను హత్య చేసిన ఈ కేసును త్వరితగతిన ఛేదించామన్నారు. బంటుమిల్లికి చెందిన చిగురుశెట్టి సుభాష్‌ చంద్రబోస్‌ ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి భార్య శిరీష ఏలూరు జిల్లా ఎన్‌కెపల్లి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి పరశురామయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భర్త అడ్డుగా ఉంటున్నాడని, హతమార్చాలని పథకం పన్నింది. ప్రియుడితో ఈ విషయం చెప్పింది. ప్రియుడు, మరో ముగ్గురితో కలిసి సుభా్‌షచంద్రబో్‌సకు పెదపట్నం నుంచి ఫోన్‌ చేస్తున్నామని, ఉల్లిపాయలు కావాలని, కిరాయి కూడా ఇస్తామని చెప్పారు. ఉల్లిపాయల మూటలు తీసుకుని పెదపట్నం వెళుతుండగా పథకం ప్రకారం 5వ తేదీ రాత్రి 7 గంటలకు బంటుమిల్లి మండలం నారాయణపురం గ్రామంలో స్మశానవాటిక దగ్గరకు సుభా్‌షచంద్రబోస్‌ రాగానే వెనుక నుంచి బైక్‌పై ముగ్గురు ఆటో దగ్గరకు వచ్చి ఐరన్‌ పైపులతో విచక్షణా రహితంగా తల, ముఖంపై కొట్టారు. 108 అంబులెన్స్‌లో సుభాష్‌ చంద్రబో్‌సను బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కేసులో నిందితులైన తిరుమలశెట్టి పరశురామయ్య, భార్య శిరీష, నిడమర్రు మండలం భువనపల్లి గ్రామానికి చెందిన కిల్లా హేమంతకుమార్‌, భీమవరానికి చెందిన కోడిగుడ్లు మౌలి, ఏలూరు జిల్లా భువనపల్లి గ్రామానికి చెందిన జువైనల్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కేసు ఛేదించిన పెడన, బంటుమిల్లి, గూడూరు ఎస్‌ఐ నాగేంద్రకుమార్‌, వాసు, వీర్రాజులకు ఏఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీ అబ్దుల్‌ సుభాన్‌లకు రివార్డులు అందజేశారు.

Latest News

 
బాధిత కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం Thu, Oct 31, 2024, 08:00 AM
షరతులతో పండితులకు నిరుద్యోగ భృతి Thu, Oct 31, 2024, 08:00 AM
ప్రమాదవశాత్తు మరణించిన వారికీ ప్రభుత్వం అండగా నిలవాలి Thu, Oct 31, 2024, 07:59 AM
పోలవరం ఎత్తు తగ్గించడం లేదు Thu, Oct 31, 2024, 07:59 AM
రేపే ఉచిత గ్యాస్‌ Thu, Oct 31, 2024, 07:58 AM