తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల చేసిన మంత్రి

by సూర్య | Wed, Jul 10, 2024, 02:17 PM

ప్రకాశం బ్యారేజీకి వెనుక ఉన్న కృష్ణమ్మ కాలువల ద్వారా పరుగులు తీయబోతోంది. కృష్ణా తూర్పు, పశ్చిమ ఛానళ్లకు బుధవారం ఉదయం పది గంటలకు మంత్రి నిమ్మల రామానాయుడు అధికారికంగా నీటిని విడుదల చేయబోతున్నారు. పట్టిసీమ నుంచి ఎత్తిపోస్తున్న గోదావరి నీరు ప్రకాశం బ్యారేజీని తాకిన విషయం తెలిసిందే. దీంతో తొలుత తాగునీటి అవసరాలను తీర్చడానికి నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీలో గోదావరి నీరు రాకతో మొత్తం 2.9 టీఎంసీ నీరు నిల్వ ఉంది. కృష్ణా తూర్పు చానల్‌కు 1000, పశ్చిమ చానల్‌కు 1000 క్యూసెక్కుల నీటిని తొలుత విడుదల చేస్తారు. తర్వాత అంచెలంచెలుగా ఈ నీటి విడుదలను పెంచుతారు. పది రోజులపాటు పూర్తిగా తాగునీటి అవసరాలను తీర్చడానికే నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో తాగునీటి కటకటలు కనిపిస్తున్నాయి. దీంతో తూర్పు, పశ్చిమ చానళ్ల కింద ఉన్న చెరువులను విడుదల చేయబోయే నీటితో నింపాలని భావిస్తున్నారు. తూర్పు చానల్‌లో 547, పశ్చిమ చానల్‌ పరిధిలో 127 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు నిండే వరకు నీటిని విడుదల చేస్తారు. ఇందుకోసం పది రోజుల ప్రణాళికను రూపొందించారు. ఈ చెరువులన్నీ నిండిన తర్వాత సాగునీటి అవసరాలను తీర్చుబోతున్నారు.

Latest News

 
బాధిత కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం Thu, Oct 31, 2024, 08:00 AM
షరతులతో పండితులకు నిరుద్యోగ భృతి Thu, Oct 31, 2024, 08:00 AM
ప్రమాదవశాత్తు మరణించిన వారికీ ప్రభుత్వం అండగా నిలవాలి Thu, Oct 31, 2024, 07:59 AM
పోలవరం ఎత్తు తగ్గించడం లేదు Thu, Oct 31, 2024, 07:59 AM
రేపే ఉచిత గ్యాస్‌ Thu, Oct 31, 2024, 07:58 AM