by సూర్య | Wed, Jul 10, 2024, 02:16 PM
నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ పట్టణంలోని సత్రం వీధిలో రూ.2.70 లక్షలు మంగళవారం చోరీకి గురయ్యాయి. రుద్రవరం మండలం మందలూరు గ్రామానికి చెందిన లింగమూర్తి రెడ్డి ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రధాన ఎస్‌బీఐలో రూ.4.70 లక్షలు డ్రా చేసుకొని రూ.2 లక్షలు రసాయనిక ఎరువుల దుకాణంలో చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని తన మోటార్ సైకిల్ ట్యాంకు కవరులో ఉంచుకున్నారు. తన గ్రామానికి వెళ్తూ ఆళ్లగడ్డ పట్టణంలోని సత్రం వీధి మొదట్లో ఉన్న టైలరు షాపులో ఇచ్చిన పిల్లల యూనిఫాం తీసుకొవడానికి మోటార్ సైకిల్‌ను టైలర్ షాపు ముందుంచి వెళ్లారు. అయితే దుస్తులు తీసుకొని వచ్చేలోగా ట్యాంకు కవరులో ఉన్న రూ.2.70 లక్షలు కన్పించడం లేదని ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ నగీనా తెలిపారు.
Latest News