కొందరు అధికారులు వైసీపీ తొత్తులుగా మారి విధానాలని తుంగలో త్రొక్కారు

by సూర్య | Wed, Jul 10, 2024, 02:15 PM

 గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ శాఖలన్నింటిని ప్రక్షాళన చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మంగళవారం అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి అవుకు పట్టణానికి వచ్చిన బీసీ జనార్దన్‌ రెడ్డికి టీడీపీ సీనియర్‌ నాయకులు ఐవీ పక్కీరరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయభాస్కర్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు ఐ. ఉగ్రసేనారెడ్డి, టీడీపీ ఎస్టీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరమణనాయక్‌, బత్తిన మద్దిలేటి గౌడు, దంతెల రమణ, తిక్కన్న ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అవుకులోని ఎస్సార్బీసీ గెస్ట్‌హౌస్‌లో మండలంలోని ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలతో ఆత్మీయ సమావే శాన్ని నిర్వహించారు. గ్రామాల వారిగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలను మరిచిపోనన్నారు. గతంలో కొందరు అధికారులు వైసీపీ తొత్తులుగా మారి పరిపాలనను భ్రష్టు పట్టించారని విమర్శించారు. వైసీపీ నాయకులు చివరకు ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసి అక్రమించుకున్నారన్నారు. టీడీపీ కక్షసాధింపు చర్యలకు దిగదని అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పులు చేసిన వైసీపీ నాయకులను, వారికి కొమ్ముకాసిన అధికారులపై విజిలెన్స్‌ విచారణ జరుగుతుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒక్క ఇసుక కుంభకోణం ద్వారా రూ. 50 వేల కోట్లకు పైగా కొల్లగొట్టిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాట్రేడ్డి మల్లికార్జునరెడ్డి, మొట్ల రామిరెడ్డి, గూడాల ప్రతా ప్‌రెడ్డి, మురళీధరరెడ్డి, ఎస్‌. రామక్రిష్ణారెడ్డి, మారం.భాస్కర్‌రెడ్డి, ఈరన్నగారి శ్రీనివాసులు, వేములపాడు గుర్రప్ప, ఆకులనాగిరెడ్డి, మారం పుల్లారెడ్డి, నారపురెడ్డి, నాగమునెయ్య, బాలనాగిరెడ్డి, బైరెడ్డి భాస్కర్‌రెడ్డి, సాంబశివారెడ్డి, జగన్‌, ఆరుణ్‌నాయక్‌, వెంకట రాముడు నాయక్‌ పాల్గొన్నారు.

Latest News

 
సోమ్మసిల్లి పడిపోయిన పారిశుధ్య కార్మికురాలు Thu, Oct 31, 2024, 01:03 PM
ఉచితంగా మట్టి ప్రమిదలను ఉచిత పంపిణీ Thu, Oct 31, 2024, 01:01 PM
కొవిడ్‌ను మించిన ప్రాణాంతక వ్యాధి క్షయ.. డబ్ల్యూహెచ్‌వో వెల్లడి Thu, Oct 31, 2024, 12:58 PM
బాధిత కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం Thu, Oct 31, 2024, 08:00 AM
షరతులతో పండితులకు నిరుద్యోగ భృతి Thu, Oct 31, 2024, 08:00 AM