భార్య వలన ప్రాణహాని ఉందని పిర్యాదు చేసిన భర్త

by సూర్య | Wed, Jul 10, 2024, 02:15 PM

తన భార్య నుంచి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఓ భర్త పోలీసులను ఆశయ్రించాడు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా, గార మండలం పేర్లవానిపేట గ్రామానికి చెందిన పేర్ల చైతన్యకు తన అక్క కుమార్తెతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వృత్తిరీత్యా సీమెన్‌ కావడంతో చైతన్య ఎక్కువగా సముద్రంలో ఉంటుంటాడు. అయితే గత రెండేళ్లుగా అతని భార్య అదే గ్రామానికి చెందిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం, భర్త జీతం డబ్బులను విలాసాలకు వినియోగిస్తున్నట్లు గ్రామస్థుల ద్వారా చైతన్య కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీనిపై ఆమెను నిలదీశారు. అయినా పరిస్థితిలో మార్పురాకపోవడంతో చైతన్య కుటుంబ సభ్యులు గార పోలీసులను ఆశ్రయించారు. భర్త ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ఉద్యోగం నుంచి వచ్చి చైతన్య మంగళవారం ఫిర్యాదు చేశాడు. ఇది తెలుసుకున్న భార్య.. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై శ్రీకాకుళం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాను చెప్పింది చేయకపోతే చంపుతానని తన భార్య బెదిరిస్తుందని, న్యాయం చేయాలని పోలీసు లకు చైతన్య మొరపెట్టుకున్నాడు. దీంతో గార, వన్‌టౌన్‌లో అందిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Latest News

 
దెందేరు నుంచి పురిటిపెంటకు మారిన సీఎం పర్యటన Thu, Oct 31, 2024, 04:40 PM
దీపావళి సందర్భంగా జియో ఇంటర్నెట్ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్ Thu, Oct 31, 2024, 04:39 PM
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు Thu, Oct 31, 2024, 04:35 PM
మరో ఎన్నికల హామీ అమలు! Thu, Oct 31, 2024, 04:34 PM
సీఎం సహాయ నిధి నుండి బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ Thu, Oct 31, 2024, 04:33 PM