by సూర్య | Wed, Jul 10, 2024, 02:12 PM
పదవ తరగతి పరీక్షల మూల్యాంకన విధుల్లో పాల్గొన్న ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో రెమ్యూనరేషన చెల్లించు టకు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని యూటీఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్, జాబీర్ హెచ్చరించా రు. మంగళవారం వారు యూటీ ఎఫ్ నేతలతో కలిసి అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాశరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పది రోజుల్లో టీఏ, డీఏ రెమ్యూనరేషన బకాయిలు చెల్లించకపోతే డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామన్నారు. 2023 ఏప్రిల్‌లో జరిగిన పదవ తరగతి మూల్యాంకన విధులకు సంబంధించి న రెమ్యూనరేషన సైతం ఇంతవరకు చెల్లించలేదని పలుసార్లు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లి వెళ్లినా, స్పందన లేకపోవడంతో కలెక్టర్‌ను కలిసి విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సర మూల్యాంకన రెమ్యునరేషన చెల్లింపులో అలసత్వం ప్రదర్శించినవారిపూ చర్యలు తీసుకోవాలని కోరారు. 2023లో జరిగిన నిర్లక్ష్యం 2024లో కూడా పునరావృతం కావడం ఉపాధ్యాయులతో వెట్టిచాకిరి చేయించుకోవదానికి నిదర్శనమని వారు ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ చిన్నమండెం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి రాయచోటి మండల నాయకులు అమర్‌నాఽథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest News