by సూర్య | Wed, Jul 10, 2024, 02:12 PM
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో పనిచేస్తున్న కొంతమంది ఆయాలు, పారిశుధ్య కార్మికులను గత ప్రభుత్వం అర్థాంతరంగా తొలగించిందని, ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని విజయవాడకు చెందిన ఏపీజీసీఏఎస్ యూనియన్ ప్రతినిధులు లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తొమ్మిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నామని పాఠశాలల విలీనంతో పని ఒత్తిడి పెరిగిందని తెలిపారు. కనీస వేతనం అమలు చేయడంతోపాటు అకారణంగా విధుల నుంచి తొలగించిన వారిని విధుల్లో తీసుకోవాలని పారిశుధ్య కార్మికులు కోరారు.
Latest News