by సూర్య | Wed, Jul 10, 2024, 02:11 PM
సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమేరాలు తప్పనిసరిగా ఏర్పా టుచేయాలని గుంటూరు రేం జి డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న తాడేపల్లి పరిధిలో పలు ప్రాంతాలను డీఎస్పీ రవికాంత్, సీఐ కళ్యా ణ్‌రాజు సిబ్బందితో కలిసి మంగళవారం ఆయన పరిశీ లించారు. కృష్ణానది తీరం వెంబడి ఉన్న సీతానగరం, ప్రకాశం బ్యారేజి, మహానాడు తదితర ప్రాంతాల్లో ఎక్కడ ఎక్క డెక్కడ సీసీ కెమేరాలు ఉన్నాయో వాటి పనితీరు అడిగి తెలుసుకున్నారు. అలాగే మరికొన్నిచోట్ల నూతనంగా సీసీ కెమేరాలు స్థానికుల స మన్వయంతో ఏర్పాటుచేయాలని సూచించారు. సీఎం, మంత్రులు సహా వీవీఐ పీలు తిరిగే మార్గాలుకావడంతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో అలసత్వం వహించరాదని ఆదేశించారు. చట్టవ్యతిరేకకార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించడం తగదని హెచ్చరించారు. కఠినచర్యలు తీసుకోవాలన్నారు.
Latest News