by సూర్య | Wed, Jul 10, 2024, 02:13 PM
శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయ పోరాటానికి దిగారు. గతంలో వైసీపీ సోషల్ మీడియా వేదికగా జరిగిన వేధింపులపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తన మీద తన కుటుంబం మీద రాసిన అశ్లీల , అసభ్యకర రాతలు మీద పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో శిరీష న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈరోజు (బుధవారం) సెకండ్ అడిషనల్ సివిల్ న్యాయస్థానానికి హాజరుకానున్నారు. దీనిపైన హోంమంత్రిని కూడా కలిసి వినతిపత్రం ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇలా వేధింపులకు గురైన వారు బయటకు రావాలని కోరుతున్నామని... అటువంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు.
Latest News