భువనేశ్వరి యాత్రకి అభిమానులనుండి అభినందనలు

by సూర్య | Sat, Apr 13, 2024, 09:40 PM

నిజం గెలవాలి ఎన్డీఏ రావాలి హ్యాష్ ట్యాగ్.. దేశవ్యాప్తంగా ఎక్స్‌ ఖాతాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది అని టీడీపీ నాయకులు తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై చనిపోయిన అన్నీ కుటుంబాలని నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి పరామర్శించారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా.. పార్టీ అన్నీ విధాలుగా అండగా ఉంటుందని వారికి తన యాత్ర ద్వారా భువనేశ్వరి భరోసా కల్పించారు. ఏప్రిల్ 13వ తేదీతో.. అంటే ఈరోజుతో ఆ యాత్ర ముగిసింది. దీంతో ఎక్స్ వేదికగా భువనేశ్వరిని అభినందిస్తూ లక్షల సంఖ్యలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆ క్రమంలో ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 52 రోజుల తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయింది. అయితే చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో తీవ్ర మనస్తాపానికి గురై 203 మంది మరణించారు. వారి కుటుంబాలకి భరోసా కల్పిచడానికి నారా భువనేశ్వరి ఈ యాత్ర చేపట్టారు. 

Latest News

 
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు Fri, May 24, 2024, 11:26 AM
సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు Fri, May 24, 2024, 11:25 AM
జియో ఫిజిక్స్ లో సులోచన రాణికి డాక్టరేట్ Fri, May 24, 2024, 10:31 AM
ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు Fri, May 24, 2024, 10:21 AM
వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి రధోత్సవం Fri, May 24, 2024, 10:20 AM