మా ఛానల్ హ్యాక్ చేసారు

by సూర్య | Sat, Apr 13, 2024, 09:42 PM

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినట్లు ఆ పార్టీ నేతలు గుర్తించారు. దీంతో యూట్యూబ్ ఛానెల్ సరి చేసేందుకు నిపుణులను ఆగ మేఘాల మీద రంగంలోకి దింపారు. అయితే ఈ చానెల్‌ను విదేశాల్లో హ్యాక్ చేసినట్లు వారు గుర్తించారు. సాంకేతికపరమైన సెట్టింగ్‌లను నిపుణుల బృందం మారుస్తుంది. మళ్లీ యాధావిధిగా యూట్యూబ్ చానెల్ ప్రసారమయ్యేలా నిపుణులు చర్యలు చేపట్టారు. అయితే కావాలని కుట్రతోనే పార్టీ యూట్యూబ్ చానెల్‌ హ్యాక్ చేశారని జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే అధికార జగన్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఓ ప్రచారం అయితే వైరల్ అవుతోంది. అదీకాక ఆ పార్టీలోని కీలక నేతలంతా ఇతర పార్టీల్లోకి క్యూ కట్టారు.. కడుతోన్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ వరుసగా అధికారాన్ని దక్కించుకొనేందుకు వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఇంకోవైపు ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు నల్లేరు మీద నడకేనని ఇప్పటికే పలు సర్వేలు సుస్పష్టం చేశాయి.

Latest News

 
కడప-చెన్నై రహదారిపై రెండు బస్సులు ఢీ Wed, May 22, 2024, 12:49 PM
మేమొస్తే ఇలా చేస్తామని మేనిఫెస్టోలో వాళ్లెందుకు పెట్టలేదు..? Wed, May 22, 2024, 12:39 PM
సోమిరెడ్డికి సవాల్ విసిరిన కాకాని Wed, May 22, 2024, 12:37 PM
చంద్రబాబు ఎక్కడికి, ఎందుకు వెళ్ళాడో చెప్పాలి Wed, May 22, 2024, 12:36 PM
విచారణకు నేను సిద్ధంగా ఉన్నా Wed, May 22, 2024, 12:36 PM