జగన్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శున్యం

by సూర్య | Sat, Apr 13, 2024, 04:37 PM

సీఎం జగన్ ఏపీకి పట్టిన శని అని తెలుగుదేశం పార్టీ  సీనియర్ నేత పిల్లి మాణిక్యరావు అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. ఏపీలో పలు గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయని.. అభివృద్ధిపై వైసీపీ సర్పంచ్‌లు ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. రూ. 13 వేల కోట్ల పంచాయతీ నిధులను సీఎం జగన్ దారి మళ్లించారని మండిపడ్డారు. జగన్ దోపిడీతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయని చెప్పారు. టీడీపీ హయాంలో వేలకోట్లతో నిర్మించిన భవనాలకు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసుకుందని ఎద్దేవా చేశారు. జగన్ చర్యలతో సర్పంచ్‌లు లబోదిబో మంటున్నారన్నారు. గ్రామాల్లో మహిళల ఆత్మ గౌరవాన్ని జగన్ దెబ్బతీశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన రోడ్లకు జగన్ ప్రభుత్వం డ్రైన్లు కూడా నిర్మించలేదన్నాని మండిపడ్డారు.

Latest News

 
“డిండి ప్రాజెక్ట్‌కి పర్యాటకుల వరం: సందడి గరిష్టం” Sat, Nov 08, 2025, 11:33 PM
“పాకిస్తాన్ జాతకీ ఆట: సౌతాఫ్రికాను పరాజయపరుస్తూ!” Sat, Nov 08, 2025, 10:31 PM
తిరుపతి పర్యటనలో పవన్ కళ్యాణ్‌కు నిరసన సెగ Sat, Nov 08, 2025, 10:17 PM
ఏపీలోని ఆ ఉద్యోగులకు సూపర్ న్యూస్.. ఫోటో కొట్టు, ప్రైజ్ పట్టు Sat, Nov 08, 2025, 10:14 PM
గూగుల్ తర్వాత విశాఖకు మరో శుభవార్త.. ఈ నెలలోనే.. ముహూర్తం ఫిక్స్! Sat, Nov 08, 2025, 10:12 PM