సీఎం జగన్ పై మండిపడ్డ షర్మిల

by సూర్య | Sat, Apr 13, 2024, 04:38 PM

కడపలో తన ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రజలు నమ్ముతున్నారన్న షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. తాను జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో పుట్టానని షర్మిల చెప్పారు. ఇదే తన జన్మస్థలం అని అన్నారు. వైఎస్ఆర్, వివేకాలు ప్రజా నాయకులుగా గొప్ప పేరు సంపాదించుకున్నారన్నారు. తమతో ఇంట్లో ఎలా ఉండే వారో ప్రజల కోసమూ అలాగే ఉన్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి ఎప్పుడు పిలిచినా పలికే వారని కొనియాడారు.

Latest News

 
కడప-చెన్నై రహదారిపై రెండు బస్సులు ఢీ Wed, May 22, 2024, 12:49 PM
మేమొస్తే ఇలా చేస్తామని మేనిఫెస్టోలో వాళ్లెందుకు పెట్టలేదు..? Wed, May 22, 2024, 12:39 PM
సోమిరెడ్డికి సవాల్ విసిరిన కాకాని Wed, May 22, 2024, 12:37 PM
చంద్రబాబు ఎక్కడికి, ఎందుకు వెళ్ళాడో చెప్పాలి Wed, May 22, 2024, 12:36 PM
విచారణకు నేను సిద్ధంగా ఉన్నా Wed, May 22, 2024, 12:36 PM