చేనేతలకు మేలు చేసింది వైసీపీ ప్రభుత్వమే

by సూర్య | Sat, Apr 13, 2024, 04:01 PM

చేనేత పరిశ్రమ, కార్మికుల పరిస్థితులు, ఇబ్బందులు తెలుసుకోవడం కోసం సీఎం వైఎస్‌ జగన్ రాష్ట్రం అంతా ప్రయాణిస్తూ వివిధ వర్గాలను కలుస్తూ వాళ్ల సమస్యలను తెలుసుకుంటూ వస్తున్నారు అని ఎమ్మెల్సీ  మురుగుడు హనుమంతరావు అన్నారు. నేడు అయన మాట్లాడుతూ.... ఇవాళ చేనేతల కోసం నేడు ఇక్కడ మనకు అవకాశం కల్పించడం ముఖ్యమంత్రిగారు తీసుకున్న గొప్ప నిర్ణయం. చేనేతలుగా మంగళగిరిలో మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మంగళగిరిలో తయారైన బట్ట మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.  దేశం నలుమూలల నుంచి మన మంగళగిరి వస్త్రాల కోసం వస్తున్నారు. దీనికి కారణం అప్పటి పెద్దలు స్టాండర్డ్ గా తయారు చేసిన రంగులు, నూలు, డిజైన్లు అని చెప్పుకోవాలి. మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వైయ‌స్ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా రోశయ్య గారిని, నన్ను పిలిచి చేనేత పరిశ్రమ పరిస్థితులు ఏంటి అని అడిగారు. 65 ఏళ్లకు పెన్షన్లు ఇస్తున్నారు, చేనేతలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇవ్వాలని కోరాను. అదెలా సాధ్యం అని ఆయన అడిగారు. రంగులు, రసాయనాల వల్ల మామూలు వ్యక్తుల కంటే చేనేత కార్మికులకు 50 ఏళ్లకే త్వరగా వృద్ధాప్యం వస్తుందని చెప్పాము. అది విని వెంటనే ఆయన అందుకు అంగీకరించారు. అలాగే చేనేతల కోసం మేము ఇచ్చిన 17 డిమాండ్లు కూడా నెరవేర్చారు. చేనేతల క్రిఫ్ట్ ఫండ్ ను రెట్టింపు చేసిన వ్యక్తి కూడా వైయ‌స్ఆర్‌ అని అన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM