చేనేత వృత్తిని జగన్ తప్ప గుర్తించిన వారే లేరు

by సూర్య | Sat, Apr 13, 2024, 04:04 PM

నవరత్నాల ప‌థ‌కాల్లో అగ్రభాగం అందుకుంటున్నది మ‌న చేనేతలే అని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి మాట్లాడుతూ.... ఒక చేనేత బిడ్డను, ఒక సాధారణమైన కుటుంబం, మధ్యతరగతి కంటే దిగువన ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఒక సోదరిని తన ప్రభుత్వంలో పద్మశాలి కార్పొరేషన్ కు ఛైర్మన్ గా చేయడమే కాకుండా ఈరోజు చేనేత విభాగానికి సంబంధించిన ఈ మీటింగ్ ను నిర్వహించమని చెప్పినందుకు సీఎం వైయ‌స్ జగన్ కు ధన్యవాదాలు. పార్టీ స్థాపించినరోజు నుండి జగనన్నతోనే నా ప్రయాణం సాగుతోంది. అయినా ఎప్పుడూ కూడా నా పర్సనల్ విషయాలు అన్నకు చెప్పుకోలేదు. అయినా కూడా నాకు కాళ్లు బాగాలేవన్న విషయం ఆయన తెలుసుకుని నేను ఎప్పుడు కనిపించినా నీకు కాళ్లు బాగాలేవు జాగ్రత్తగా ఉండు తల్లీ అంటారు జగనన్న. తనను నమ్ముకున్న వారికోసం ఏవిధంగా ఆలోచిస్తారో గుర్తించుకోవాలి సోదరుల్లారా, సోదరీమణుల్లారా. చేనేత వృత్తిని ఏ ప్రభుత్వమూ, ఏ నాయకుడూ గుర్తించింది లేదు. ఎందుకంటే ఏ నాయకుడికి మన మీద అవగాహన లేదు, మనస్సు లేదు. కానీ దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మనకు 50 ఏళ్లకే పెన్షన్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆప్కోస్ ద్వారా ఎన్నో సబ్సిడీలు తీసుకొచ్చారు. మన సీఎం జగనన్న ఎక్కడా లేనివిధంగా చేనేతలకు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.24 వేలను పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. నవరత్నాల సంక్షేమాల్లో అగ్రభాగం అందుకుంటున్నది మన చేనేతలే. సుదీర్ఘ పాదయాత్రలో చేనేతల కష్టాలను కళ్లారా చూశారు, సమస్యలను తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో చేనేతలను నట్టేట్లో ముంచితే ఆప్కోను బయటికి తీసుకొచ్చి రూ.180 కోట్లను అందించారు. కరోనా కష్టకాలంలో రెండుసార్లు రూ.24 వేలు ఇవ్వడం జరిగింది. కాబట్టి జగనన్న లాంటి నాయకుడు మనకు ఉండటం ఎంత అవసరమో ఆలోచన చేయాలి. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిగా జగనన్న నిలబెట్టిన పద్మశాలి సోదరి లావణ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Latest News

 
ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం Wed, May 22, 2024, 01:40 PM
పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారా..? Wed, May 22, 2024, 01:18 PM
బాల్య వివాహాల అరికట్టే దిశగా అవగాహన కల్పించాలి Wed, May 22, 2024, 01:17 PM
ద్వారకా తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు Wed, May 22, 2024, 01:16 PM
జూన్ 4ఫలితాలతో జగన్ పనైపోతుంది Wed, May 22, 2024, 01:15 PM