ప్రజలంతా సీఎం వైయ‌స్ జగన్ కి అండగా ఉండాలి

by సూర్య | Sat, Apr 13, 2024, 03:58 PM

వైయ‌స్ జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు. బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు. వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా. అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు. మేనత్తగా చెబుతున్నా మీరు ఇప్పటికైనా మారండి.. నోళ్లు మూసుకోండి. లేదంటే ఒకసారి షర్మిల, సునీత మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకోండి.  అవినాష్ గెలవాలని చివరిరోజువరకూ వివేకానంద రెడ్డి పనిచేశారు. ప్రజలంతా సీఎం వైయ‌స్ జగన్ కి అండగా ఉండాలి. మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి. అవినాష్ కు, వైయ‌స్ జగన్ కు ఓట్లు వేసి గెలిపించాలి. షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్ ను నమ్మవద్దు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాల‌ని విమల ఏపీ ప్రజల్ని కోరారు. 

Latest News

 
ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం Wed, May 22, 2024, 01:40 PM
పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారా..? Wed, May 22, 2024, 01:18 PM
బాల్య వివాహాల అరికట్టే దిశగా అవగాహన కల్పించాలి Wed, May 22, 2024, 01:17 PM
ద్వారకా తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు Wed, May 22, 2024, 01:16 PM
జూన్ 4ఫలితాలతో జగన్ పనైపోతుంది Wed, May 22, 2024, 01:15 PM