`మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర అప్ డేట్స్

by సూర్య | Sat, Apr 13, 2024, 03:56 PM

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర 14వ రోజు గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నుంచి ప్రారంభ‌మైంది. ప్ర‌జ‌లు జ‌న‌నేత‌ వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఉప్పొంగుతున్న అభిమానంతో జ‌న‌నేత‌కు గ‌జ‌మాల‌తో స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌జ‌లు అడుగడుగునా వైయ‌స్ జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు బ్రహ్మరథం ప‌డుతున్నారు. నేడు బ‌స్సు యాత్ర‌  కాజా, మంగళగిరి బైపాస్ మీదగా 11 గంటలకు CK కన్వెన్షన్ వద్దకు చేరుకుంటుంది. CK కన్వెన్షన్ వ‌ద్ద‌ చేనేత కార్మికులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదగా తాడేపల్లి బైపాస్ కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్ , పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

Latest News

 
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు Fri, May 24, 2024, 11:26 AM
సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు Fri, May 24, 2024, 11:25 AM
జియో ఫిజిక్స్ లో సులోచన రాణికి డాక్టరేట్ Fri, May 24, 2024, 10:31 AM
ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు Fri, May 24, 2024, 10:21 AM
వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి రధోత్సవం Fri, May 24, 2024, 10:20 AM