by సూర్య | Sat, Apr 13, 2024, 02:29 PM
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పీలేరులో చోటు చేసుకుంది. శనివారం ఉదయం స్థానిక కామాటంపల్లికి చెందిన జి. శ్రీరాములు (71) తన ఇంటి నుంచి పాత బస్టాండుకు నడుచుకు వెళుతుండగా పట్టణంలోని బోదేషావలి దర్గా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొని తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని వారి బంధువులు ఆటోలో ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Latest News