ఏసీని రాత్రంతా వాడినా నో కరెంట్ బిల్..

by సూర్య | Sat, Apr 13, 2024, 02:09 PM

ఏసీని రాత్రంతా వాడినా నో కరెంట్ బిల్.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.. ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో మనలో చాలామంది వేడి నుంచి ఉపశమనం పొందటానికి ఏసీలపైన ఎక్కువగా ఆధారపడుతున్నారు.AC ఎక్కువగా వాడితే కరెంట్ బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది. ఆ చిట్కాలు గురించి తెలుసుకుందాం.మనలో చాలామంది ఏసీని 16 లేదా 18° వద్ద పెడుతూ ఉంటారు. అలా అయితే కూలింగ్ బాగా వస్తుందని భావిస్తారు. అయితే మానవ శరీరానికి అనువైన ఉష్ణోగ్రత 24 డిగ్రీలు కాబట్టి ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల వద్ద ఉంచితే సరిపోతుంది. ఇలా ఉష్ణోగ్రతను పెంచటం ద్వారా ఆరు శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది.ఏసీ ఆన్ చేయటానికి ముందు గదిలో ప్రతి తలుపు మరియు ప్రతి కిటికీ మూసివేయాలి. ఇలా చేయడం వలన వేడి గాలి లోపలికి రాదు. చల్లని గాలి బయటకు వెళ్ళదు. ఈ విధంగా చేయకపోతే ఏసీ ఎక్కువగా పనిచేసి కరెంట్ బిల్లు కూడా ఎక్కువగానే వస్తుంది. ఏసీ ని స్లీప్ మోడ్లో ఉపయోగిస్తే 36 శాతం విద్యుత్ ఆదా అవుతుంది.


 


ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా ఉపయోగిస్తే ఏసీ గాలి గదిలో ప్రతి మూలకు వెళుతుంది. దాంతో గది ఎక్కువసేపు చల్లగా ఉంటుంది. ఏసీ ఉష్ణోగ్రతను కూడా తగ్గించాల్సిన అవసరం రాదు. ఈ చిట్కాలను పాటిస్తే గది చల్లగా ఉండడమే కాకుండా తక్కువ కరెంటు బిల్లు కూడా వస్తుంది.


గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.


 


 

Latest News

 
అత్తింట్లో అల్లుడి కక్కుర్తి.. సిగ్గు లేకుండా ఇదేం పాడుపని! Sat, Dec 14, 2024, 07:32 PM
ఐకాన్‌స్టార్‌ను కలిసిన పీపుల్స్ స్టార్ Sat, Dec 14, 2024, 07:28 PM
ఏపీలో ఆ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాం.. వైఎస్ జగన్ కీలక ప్రకటన Sat, Dec 14, 2024, 07:16 PM
గుజరాత్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ Sat, Dec 14, 2024, 07:05 PM
2029లో జమిలీ ఎన్నికలు,,,చంద్రబాబు కీలక వ్యాఖ్యలు Sat, Dec 14, 2024, 07:02 PM