by సూర్య | Sat, Apr 13, 2024, 12:17 PM
చీరాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత కీలకమైన ఎన్నికల సమయంలో చురుకుగా లేకపోవడం పై అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. కనీసం చీరాలలో కూడా వైసిపి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తరచూ మీడియా సమావేశాలు పెట్టి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తదితరులపై విరుచుకుపడే ఈ ఫైర్ బ్రాండ్ ఆ పని కూడా చేయడం లేదు. చీరాల టిక్కెట్ ఆశించి భంగపడి ఆమె కినుక వహించారంటున్నారు.
Latest News