పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే కారణంతో విద్యార్థి ఆత్మహత్య

by సూర్య | Fri, Apr 12, 2024, 06:27 PM

పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామానికి చెందిన అర్చన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. మార్చిలో జరిగిన పరీక్షలకు ఆమె హాజరయ్యారు. ఈ క్రమంలో ఇవాళ ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల్లో అర్చన ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. సూసైడ్ లెటర్ రాసి అఘాయిత్యానికి పాల్పడింది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే కారణంతో సూసైడ్ చేసుకోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. పరీక్షలు ఏవైనా సరే.. ఫెయిల్ అయితే తట్టుకోలేకపోతున్నారు. ఇంట్లో వాళ్లు తిడతారనో పొరుగువారు ఏమనుకుంటారనో తీవ్ర మనో వేదనకు గురువుతున్నారు. తమ ఇబ్బందిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ రాసి పాస్ అవ్వొచ్చు అనే ధైర్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లలకు అనుక్షణం సలహాలు, సూచనలు అందిస్తూ మార్గదర్శకంగా ఉండాలి.

Latest News

 
వైసీపీ పార్టీ త‌ర‌ఫున స‌హానా ఫ్యామిలీని ఆదుకుంటామ‌న్న మాజీ సీఎం Wed, Oct 23, 2024, 02:52 PM
గుంటూరు, బ‌ద్వేల్ ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్తావిస్తూ రోజా ఆగ్ర‌హం Wed, Oct 23, 2024, 02:47 PM
తల్లి, సోదరి సహా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణను ప్రతివాదులుగా చేర్చిన వైసీపీ అధినేత Wed, Oct 23, 2024, 02:40 PM
హోం మంత్రిపై రోజా కామెంట్స్‌ Wed, Oct 23, 2024, 02:21 PM
నారాయణ కాలేజీ భవనం పైనుంచి జారిపడి ఇంటర్‌ విద్యార్థి మృతి Wed, Oct 23, 2024, 02:15 PM