నేడు కొల్లూరులో చంద్రబాబు బహిరంగ సభ

by సూర్య | Fri, Apr 12, 2024, 06:28 PM

 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలు, రోడ్ షోలు  నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాగళంలో భాగంగా శుక్రవారం ఆయన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేమూరు, రేపల్లె  నియోజకవర్గాలలో ప్రజాగళం సభలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కొల్లూరు, రాత్రి 7 గంటలకు రేపల్లెలో బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి రేపల్లెలోనే చంద్రబాబు బస చేస్తారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లును మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు.

Latest News

 
శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం Wed, Oct 23, 2024, 12:18 PM
నేటి పంచాంగం Wed, Oct 23, 2024, 11:44 AM
తుఫాన్‌ నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలి Wed, Oct 23, 2024, 10:19 AM
పారామెడికల్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం Wed, Oct 23, 2024, 10:17 AM
శివశంక్‌కి సుప్రీంకోర్టు షాక్ Tue, Oct 22, 2024, 11:14 PM