కాకినాడ తీరంలో తిరగబడ్డ పడవ.. ఇద్దరు మత్స్యకారులు గల్లంతు

by సూర్య | Tue, Nov 21, 2023, 07:10 PM

కాకినాడ జిల్లాలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం ఐదుగురు మత్స్యకారులు నాటు పడవపై చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లారు. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులతో పాటుగా సముద్ర అలద బెబ్కు పడవ ప్రయాణం సాగడానికి అనుకూలించలేదు. ఈ క్రమంలో పడవ బోల్తా పడటంతో ఐదుగురు జార్లు సముద్రంలో గల్లంతయ్యారు. ముగ్గురు జాలరులు ఎలాగోలా ఈదుకుంటూ తీరానికి చేరుకున్నారు. వీరిలో సూర్యారావు పేటకు చెందిన గరికిన సత్తిరాజు.. దుమ్ములపేటకు చెందిన మైలపల్లి కృప దాసు అలల దెబ్బకు గల్లంతయ్యారు. ఈ విషయం తెలియడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. వెంటనే రంగంలోకి మెరైన్ సిబ్బంది రంగంలోకి దిగి తమవారిని కాపాడాలని వారు కోరుతున్నారు. స్థానిక మత్స్యకారులు కూడా తమవంతుగా గాలింపు మొదలు పెట్టారు. ఇవాళ(నవంబర్ 21) ప్రపంచ మత్స్యకార దినోత్సవం.. అయితే ఈ క్రమంలో సోమవారం విశాఖ హార్బర్‌లో అగ్నిప్రమాద ఘటన మరవక ముందే మత్స్యకారులు గల్లంతు కావడంతో ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉందంటున్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM