బంగాళాఖాతంలో ఆవర్తనాలు,,,,ఏపీకి మరో రెండ్రోజులు వర్షాలు

by సూర్య | Tue, Nov 21, 2023, 07:05 PM

ఏపీలో వర్షాలు కురుస్తాంయటోంది వాతావరణశాఖ. తూర్పు గాలులలో సగటు సముద్ర మట్టం వద్ద నుంచి ఏర్పడిన ద్రోణి శ్రీలంక నుంచి నైరుతి & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టము నుండి 3.1 కి.మీ ఎత్తు వరకు ఉన్న ఉపరితల అవర్తనము కొనసాగుతోంది.ఈ ప్రభావంతో వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు.. లేని పక్షంలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయంటున్నారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు.. లేని పక్షంలో ఉరములతో కూడిన జల్లులు కురుస్తాయంటున్నారు. దక్షిణ కోస్తాలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు.. ఉరుములతో కూడిన జల్లులకు ఛాన్స్ ఉందంటున్నారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. బుధవారం కూడా మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు.. లేని పక్షంలో ఉరుములతో కూడిన జల్లులుకు ఛాన్స్ ఉందంటున్నారు. బుధవారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందంటున్నారు.


ఇవాళ కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటోంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వాతావరణం మారింది. ఆకాశం మేఘావృతమైంది. సోమవారం అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నూర్పు చేసినధాన్యం నిల్వలకు కాపాడుకునే పనిలో ఉన్నారు. కొద్దిరోజులుగా మెట్ట ప్రాంతాల్లో పండించిన తేలిక రకం పంటల కోతలను చేపడుతున్నారు. అయితే కోత కోసిన వరి పంటను నూర్పు చేసే సమయంలో చిరుజల్లులు కురవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.


ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను తరలిద్దామన్నా .. ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ప్రస్తుతం కల్లాల్లోనే ధాన్యం నిల్వలను ఉంచాల్సి వస్తోంది. మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో జారీ చేయడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఏ మాత్రం ధాన్యం తడిసినా ఎవరూ కొనుగోలు చేయరని ఆవేదన చెందుతున్నారు. అందుబాటులో ఉన్న టార్పాలిన్లను ధాన్యం నిల్వలపై కప్పి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. చాలాచోట్ల వరి పంట కోతకు సిద్ధంగా ఉంది.. ఈ సమయంలో అధికంగా వర్షాలు కురిస్తే కొంతమేర నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షంతో ఉన్న కొద్దిపాటి పంట కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు.


మరికొన్ని చోట్ల నూర్పిడి చేసి ధాన్యాన్ని కల్లాలు, రోడ్లపై ఆరబెట్టారు. సోమవారం ఉదయం నుంచి వాతావరణంలో ఒక్కసారి మార్పు వచ్చి మేఘావృతం కావడంతో ఎండిన ధాన్యాన్ని రక్షించు పనిలో ఉన్నారు. ధాన్యంపై టార్పాలిన్లు కప్పి రక్షించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. మరికొందరు కోతలు కోసి పొలాల్లోనే వదిలేశారు. వాతావరణంలో మార్పుతో వారు ఆందోళన చెందుతున్నారు. అక్కడక్కడ చిరుజల్లులు పడడంతో ధాన్యం దాచేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM