తగిన మోతాదులో మామిడి తినొచ్చు... షుగర్ ఉన్నవారు ఇది పాటించాలి

by సూర్య | Sun, Mar 19, 2023, 09:28 PM

షుగర్ బాధితులు మామిడిపండ్లు తినొచ్చా, లేదా అన్నదానిపై తీవ్ర సందిగ్ధత ఉంది. ఎందుకంటే, మామిడి అత్యంత తియ్యగా ఉంటుంది. మామిడిపండ్లు తింటే షుగర్ లెవల్స్ రయ్యిమంటూ పైకి ఎగబాకుతామని ప్రచారంలో ఉంది. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. 


"పచ్చి మామిడి తింటే షుగర్ లెవల్స్ పెరగవు. పండిన మామిడికాయలు తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఎంతకీ షుగర్ కంట్రోల్ కానివారు పండిన మామిడి తింటే చాలా కష్టం. అయితే, షుగర్ బాధితులు కూడా మామిడి పండ్లు తినేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. తగిన మోతాదులోనే తినాలి. మితిమీరి తినరాదు. కొన్ని చోట్ల బాగా తియ్యగా ఉండే మామిడిపండ్లు దొరుకుతాయి, కొన్నిచోట్ల సాధారణ వెరైటీలు అందుబాటులో ఉంటాయి. ఏదేమైనా పరిమితంగా తినడం ఆరోగ్యానికి మంచిది. అతిగా తింటే కష్టాలు తప్పవు" అని డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ చైర్మన్, చీఫ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి. మోహన్ తెలిపారు. 


బాంబే హాస్పిటల్ కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ రాహుల్ బక్షీ మాట్లాడుతూ, మధుమేహంతో బాధపడేవారు మామిడికాయలు తినొచ్చా, లేదా అని తెలుసుకునేందుకు ఇంటర్నెట్ చూస్తే ఎంతో విస్తృతమైన సమాచారం ఉంటుందని, కొందరు తినమంటారని, కొందరు వద్దంటారని వివరించారు. అయితే, గ్లూకోజ్ లెవల్స్ పూర్తి కంట్రోల్ లో ఉన్నప్పుడు ఎవరైనా మామిడిపండ్లు తినొచ్చని డాక్టర్ బక్షీ స్పష్టం చేశారు.


మామిడి పంట్లను తగిన సమయంలో, తగిన విధంగా తినాలని పేర్కొన్నారు. మధుమేహం టైప్ ను బట్టి సగటున సగం మామిడిపండు తినడం మేలని సూచించారు. అయితే అన్నం తిన్న వెంటనే మామిడిపండు తీసుకోవడం సరికాదని తెలిపారు. మధ్నాహ్న భోజనం, రాత్రి భోజనానికి మధ్య స్నాక్ ఐటమ్ లా మామిడిని తీసుకోవడం ఉత్తమం అని వివరించారు. 


ఇక ప్రముఖ డైటీషియన్ ఉజ్వల బక్షీ స్పందిస్తూ... మామిడి అనేక పోషకాలకు నిలయం అని, డయాబెటిస్ తో బాధపడేవారు మామిడి ద్వారా తగిన పోషకాలను పొందవచ్చని తెలిపారు. ఓ షుగర్ పేషెంట్ బ్లడ్ షుగర్, రక్తపోటు, పొటాషియం స్థాయులు పరిమితికి లోబడి ఉంటే, నిరభ్యంతరంగా మామిడిపండ్లు తినొచ్చని చెప్పారు. మామిడిపండ్లు తినే విషయంలో షుగర్ బాధితులు డైటీషియన్ల సలహా తీసుకోవడం ఉత్తమం అని ఉజ్వల బక్షీ సూచించారు.


Latest News

 
ట్రావెల్ బస్సులో చెలరేగిన మంటలు Sun, Jun 16, 2024, 08:17 PM
ఎమ్మెల్యే ఉగ్ర ను కలిసిన విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు Sun, Jun 16, 2024, 08:12 PM
కాలువలో యువకుడి మృతదేహం Sun, Jun 16, 2024, 08:10 PM
గ్యాస్ ధర పెంపునకు కాంగ్రెస్ వినూత్న నిరసన Sun, Jun 16, 2024, 08:09 PM
అనుమతి లేని వాహనాలు పట్టివేత Sun, Jun 16, 2024, 08:07 PM