ఎందుకు ఈ తోడేళ్లు ఏకం అవుతున్నాయి: జగన్

by సూర్య | Sun, Mar 19, 2023, 03:18 PM

పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? ఎందుకు ఈ తోడేళ్లు ఏకం అవుతున్నాయి? అని టీడీపీ, జనసేనను ఉద్దేశించి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసినా చివరికి గెలిచేది మంచి మాత్రమేనని, సినిమాల్లో హీరోలు మాత్రమే నచ్చుతారు.. విలన్లు కాదని జగన్ తెలిపారు. విలన్ ఎవరికీ నచ్చడని, దత్తపుత్రుడు, దుష్టచతుష్టయంతో యుద్దం చేస్తున్నానని చెప్పారు.


'దుష్ట చతుష్టయానికి సవాల్ విసురుతున్నా. నా ప్రభుత్వ పరిపాలన సరిగా లేకపోతే పొత్తుల కోసం మీరెందుకు పాకులాడుతున్నారు. కుటుంబ విలువలు, రాజకీయ విలువలు లేనివారితో నేను యుద్దం చేస్తున్నా. ఎన్ని కుట్రలు చేసినా చివరికి గెలిచేది మంచి మాత్రమే. రామాయణమైనా, బైబిల్ అయినా, ఖురాన్‌లోనైనా మంచి చేసినవారే గెలుస్తారు. అర్హత లేనివాళ్లు మన ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు' అని జగన్ తెలిపారు.  గతంలో పోలిస్తే ఇప్పుడు అప్పుల పెరుగుదల తక్కువేనని జగన్ వ్యాఖ్యానించారు. గతంలో దోచుకో.. పంచుకో.. తినుకో అనేలా డీపీటీ నడిపారని, మనది డీబీటీ అయితే వాళ్లది డీపీటీ అని జగన్ విమర్శించారు


Latest News

 
పులివర్తి నాని డ్రామాలాడుతున్నారు.. వీడియో రిలీజ్ చేసిన చెవిరెడ్డి Sat, May 25, 2024, 10:24 PM
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు షాక్.. కీలకమైన ఆదేశాలు Sat, May 25, 2024, 09:44 PM
ఏపీలో విచిత్ర వాతావరణం.. ఈ జిల్లాల్లో వానలు, అక్కడ అదరగొడుతున్న ఎండలు Sat, May 25, 2024, 09:39 PM
ఆ ఇంటర్వ్యూలు వాయిదా వేయండి.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే: యూపీఎస్సీకి చైర్మన్‌కు చంద్రబాబు లేఖ Sat, May 25, 2024, 09:32 PM
రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రం.. ఎంతో లక్కీ, ధర ఎంతంటే! Sat, May 25, 2024, 09:27 PM