హైడ్రామాకు తెర.. ఎట్టకేలకు రాంభూపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఫారం అందజేత

by సూర్య | Sun, Mar 19, 2023, 03:17 PM

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శనివారం అర్థరాత్రి వరకు సాగిన హైడ్రామాకు  తెరపడింది. ఏపీలోని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎట్టకేలకు డిక్లరేషన్ అందుకున్నారు. ఇవాళ ఉదయం అనంతరపురం కలెక్టర్ నాగలక్ష్మి ఆయనకు డిక్లరేషన్ అందించారు. భూమిరెడ్డి ఎమ్మె్ల్సీగా తన సమీప ప్రత్యర్థి, వెస్సాఆర్‌సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7,543 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భూమిరెడ్డి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు నిన్న (శనివారం) రాత్రే ప్రకటించినా..ఆయన గెలుపుపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు డిక్లరేషన్ ఇవ్వలేదు. ఓట్ల లెక్కింపులో అన్యాయం జరిగిందని.. వైసీసీ అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయటంతో ఆయనకు డిక్లరేషన్ ఇవ్వలేదు. దీంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. జేఎన్‌టీయూ ప్రధాన ద్వారం అభ్యర్థి రాంగోపాల్ రెడ్డితో పాటు టీడీపీ పార్టీ నేతలు, మాజీ మంత్రులు కాలవ, పరిటాల నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.


ఈ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. సీఎం జగన్‌, ఆయన కార్యాలయం ఒత్తిడితోనే ఎన్నికల్లో గెలిచిన రాంగోపాల్‌రెడ్డికి డిక్లరేషన్‌ ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. తెదేపా అభ్యర్థి గెలిచినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించినా.. డిక్లరేషన్‌ ఇవ్వలేదని లేఖలో వివరించారు. స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎమ్మెల్సీగా గెలిచిన రాంపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఎందుకివ్వలేదని రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా గెలిచిన రాంపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఫారం ఇవ్వాలని ఆదేశారు. దీంతో ఇవాళ ఉదయం అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయనకు కలెక్టర్ నాగలక్ష్మీ డిక్లరేషన్ పత్రాలు అందజేశారు.


డిక్లరేషన్ అందుకున్న తర్వాత రాంభూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను గెలుపొందినట్లు నిన్న రాత్రి 8 గంటలకు ప్రకటించినా.. ఎన్నికల అధికారులు డిక్లరేషన్ ఇవ్వలేదని అన్నారు. మమ్మల్ని వేచి ఉండాల్సిందిగా రిటర్నింగ్ అధికారులు చెప్పారన్నారు. డిక్లరేషన్ ఫారం ఇస్తామని చెప్పి రాత్రి 10:30 గంటల వరకు వెయిట్ చేయించారన్నారు. ఇంతలో జిల్లా ఎస్పీ అక్కడికి వచ్చారని.., డిక్లరేషన్ ఎప్పుడిస్తారని అధికారులను ప్రశ్నించిగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు వచ్చిన తర్వాతే అందిస్తామని అధికారులు చెప్పారన్నారు. దీంతో ఎన్నికల ఫలితాలను మార్చే కుట్ర జరుగుతోందనే భయం తమలో మెుదలైందని.. ఈ నేపథ్యంలోనే ఆందోళన చేసినట్లు చెప్పారు. ఆదివారం ఉదయం కలెక్టర్ ఆఫీసు నుంచి తనకు ఫోన్ వచ్చిందని, ఈ రోజు కలెక్టరేట్‌లోనే డిక్లరేషన్ అందిస్తామని చెప్పారని ఆయన వివరించారు.


Latest News

 
సెంచరీ దిశగా టమాటా రేటు.. ఏపీ మార్కెటింగ్ శాఖ కీలక నిర్ణయం Tue, Jun 18, 2024, 09:24 PM
యాక్షన్‌లోకి నాదెండ్ల మనోహర్.. తనిఖీలు, కేసులతో ఫుల్ బిజీ Tue, Jun 18, 2024, 09:19 PM
వైఎస్ జగన్ తాడేపల్లి ఇంటిచుట్టూ గ్రిల్స్‌ ఎందుకంటే? Tue, Jun 18, 2024, 08:20 PM
ఇక్కడ కూడా అదే జరగాలి.. ఈవీఎంలపై వైఎస్‌ జగన్‌ కీలక ట్వీట్‌ Tue, Jun 18, 2024, 08:19 PM
పవన్ కళ్యాణ్‌కు సెక్యూరిటీ పెంపు.. Y ప్లస్‌తో ఎస్కార్ట్ వాహనం, బుల్లెట్ ప్రూఫ్ కారు Tue, Jun 18, 2024, 08:17 PM