ఉబర్ డ్రైవర్ ఇచ్చిన బిల్లుతో ఆవాక్కైన మహిళ

by సూర్య | Sun, Mar 19, 2023, 03:52 PM

ఆన్  లైన్ వచ్చాక ప్రతి దానికి ధర కూడా ఆన్ లైన్లోనే నిర్ధారణ అవుతోంది. ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. ఉబెర్ క్యాబ్‌లో కేవలం 21 కిలోమీటర్ల ప్రయాణానికి ఆమె ఏకంగా రూ.1525 చెల్లించాల్సి వచ్చింది. ఆ తరువాత ఫిర్యాదు చేయడంతో ఉబెర్ ఆ అదనపు మొత్తాన్ని ఆమెకు తిరిగి ఇచ్చేసింది. అయితే.. ఆ మొత్తాన్ని ఉబెర్ వాలెట్‌లోనే జమ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం ఓ మహిళ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చిత్తరంజన్ పార్క్‌కు వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది. తన గమ్యస్థానానికి చేరుకున్నాక బిల్లు మొత్తం రూ.1525 అని తేలడంతో ఆమె ఒక్కసారిగా అవాక్కైంది. కానీ.. కారు డ్రైవర్‌కు ఆ మొత్తాన్ని చెల్లించక తప్పలేదు. 


ఆ తరువాత మహిళ ఈ విషయమై ఉబెర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో.. సిబ్బంది ఆమె ప్రయాణం తాలూకు వివరాలు పరిశీలించాక బిల్లులో తప్పులు దొర్లిన విషయాన్ని అంగీకరించారు. జీపీఎస్‌లో లోపం కారణంగా క్యాబ్ రాష్ట్ర సరిహద్దు దాటినట్టు ట్రిప్ వివరాల్లో రికార్డయిందని చెప్పారు. దీంతో.. ఆమె అధికమొత్తం చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉబెర్ సంస్థ.. మహిళ నుంచి అదనంగా తీసుకున్న మొత్తాన్ని తిరిగిచ్చేసింది. కానీ.. ఉబెర్‌కు అనుసంధానంగా ఉన్న మహిళ డిజిటల్ వ్యాలెట్‌లో ఆ మొత్తాన్ని బదిలీ చేసింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM