డిక్లరేషన్ తీసుకున్న టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి

by సూర్య | Sun, Mar 19, 2023, 01:27 PM

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి విజయం సాధించినా.. ఎన్నికల అధికారులు డిక్లరేషన్‌ ఇవ్వలేదు. భూమిరెడ్డి గెలిచారని స్వయంగా ప్రకటించిన అధికారులు.. అనంతరం వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి నుంచి నిరసన వ్యక్తం కావడంతో యూటర్న్‌ తీసుకున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. వాస్తవానికి వైసీపీ అభ్యర్థి సహా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిరసన వ్యక్తం చేసినా.. రీకౌంటింగ్‌ జరపాలని కోరినా.. రిటర్నింగ్‌ అధికారి నాగలక్ష్మి తొలుత పట్టించుకోలేదు. కానీ, సమయం గడిచేకొద్దీ.. ఆమె మౌనం వహించారు. భూమిరెడ్డికి ఎంతకీ డిక్లరేషన్‌ ఇవ్వకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళకు దిగారు. ఎట్టకేలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ నుంచి టీడీపీ ఎమ్మెల్సీ  భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి  డిక్లరేషన్  తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. టపాసులు పేల్చి... మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

Latest News

 
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:56 PM
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:52 PM
జగన్ తల్లిని, చెల్లిని బజారుకీడ్చి ఆస్తి కోసం వెంపర్లాడుతున్నాడంటూ వర్ల విమర్శలు Fri, Oct 25, 2024, 08:31 PM
23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం Fri, Oct 25, 2024, 08:28 PM
సింగుపురంలో ఉచిత వైద్య పరీక్షలు Fri, Oct 25, 2024, 08:07 PM