అనుమానాస్పదంగా మేడ పైనుంచి క్రిందకి విద్యార్థిని

by సూర్య | Sun, Mar 19, 2023, 01:25 PM

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఉన్న వైవీఎస్‌ అండ్‌ బీఆర్‌ఎస్‌ఎం నర్సింగ్‌ కళాశాల విద్యార్థిని పల్లవిని శనివారం ఉదయం తోటి విద్యార్థినులు మేడ పైనుంచి గెట్టివేయడంతో ఆమె కాలు, చెయ్యి మూడు చోట్ల విరిగాయి. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కళాశాల హాస్టల్‌ రూమ్‌లో 8 మంది విద్యార్థినులు ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఒకరి డబ్బులు పోవడంతో అందరి బ్యాగ్‌లను విద్యార్థినులు వెతికారు. కాగా శనివారం ఉదయం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి తనను గెంటేశారని పల్లవి చెబుతోంది. పల్లవి తొలుత కళ్లు తిరిగి పడిపోయినట్టు చెప్పినట్టు సమాచారం. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కె.శంకరరావును ఎస్‌ఐ అందే పరదేశి కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Latest News

 
దుర్గమాంబా అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే పీలా Fri, Feb 23, 2024, 04:11 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ Fri, Feb 23, 2024, 04:10 PM
బర్డ్ ఫ్లూ కలకలం.. ప్రకాశం జిల్లాకు హెచ్చరిక Fri, Feb 23, 2024, 03:55 PM
టీడీపీ -జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంక్షేమ పాలన Fri, Feb 23, 2024, 03:53 PM
ఒంగోలుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Fri, Feb 23, 2024, 03:49 PM