డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతావా?

by సూర్య | Sun, Mar 19, 2023, 01:24 PM

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డిని పోలీసులు శనివారం అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేశారు. రాంగోపాల్ అరెస్ట్‎పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ‘‘ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ..ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతావా?.. పులివెందుల టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడని అక్కసుతో అర్థరాత్రి అరెస్టు చేస్తావా?..ఇంతకంటే నువ్వు ఇంకేం బ్రష్టు పట్టించాల్సివుంది. ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరు!. డిక్లరేషన్ అడిగిన రామగోపాల్ రెడ్డిని రాత్రి కౌంటింగ్ సెంటర్ వద్ద అరెస్ట్ చేసిన వీడియో‎ను జత చేసి చంద్రబాబు’’ ట్వీట్ చేశారు.

Latest News

 
జల్ మిషన్ వాటర్ ట్యాంక్ కు శంకుస్థాపన Mon, Dec 02, 2024, 12:39 PM
రాష్ట్ర అభివృద్ధి కోసమే పన్నుల వసూలు చేస్తున్నాం Mon, Dec 02, 2024, 12:08 PM
ట్రాన్స్‌జెండర్ హత్య కేసులో 12మంది అరెస్ట్ Mon, Dec 02, 2024, 12:07 PM
జగన్ బుక్కై బుకాయిస్తే కుదరదు Mon, Dec 02, 2024, 12:06 PM
వక్ఫ్‌బోర్డు పై దుష్ప్రచారం తగదు Mon, Dec 02, 2024, 11:58 AM