వైసీపీ నాయకులు వెండి బిస్కెట్లు, డబ్బులు పంపిణీ చేసినా నిజాయితీగా ఓట్లు వేశారు

by సూర్య | Sun, Mar 19, 2023, 01:24 PM

రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ ఒక్కటేనని, రెండు పార్టీలు కలిసి ఉన్నాయని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. వైసీపీతో సంబంధం లేదని బీజేపీ నాయకులుగా తాము ఎంత చెప్పినా ప్రజలు విశ్వసించడం లేదన్నారు. బీజేపీ తెలంగాణలో దూకుడుగా ఉంటూ ఏపీలో వెనుకబడి ఉండడానికి కారణం.. వైసీపీతో ఉన్నామనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవడమేనన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం వచ్చిందని, వైసీపీ నాయకులు వెండి బిస్కెట్లు, డబ్బులు పంపిణీ చేసినా నిజాయితీగా ఓట్లు వేశారన్నారు.

Latest News

 
క్షీణిస్తున్న భూమా అఖిల ప్రియా ఆరోగ్యం Fri, Sep 22, 2023, 09:53 PM
చంద్రబాబును విడుదల చేయాలంటూ కొనసాగుతున్న ఆందోళనలు... దీక్షలు Fri, Sep 22, 2023, 09:36 PM
ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది...రామ్ గోపాల్ వర్మ Fri, Sep 22, 2023, 09:36 PM
ఏపీలో వారికి జగన్ సర్కార్ శుభవార్త,,,,ఈ నెల 29న అకౌంట్‌లలో డబ్బులు Fri, Sep 22, 2023, 08:05 PM
ఇకపై సభలోకి మొబైల్స్‌కు నో పర్మిషన్,,,ఏపీ అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం Fri, Sep 22, 2023, 08:01 PM