కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

by సూర్య | Sun, Mar 19, 2023, 01:22 PM

కావలి బాలక్రిష్ణారెడ్డినగర్‌లో కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన  జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.....  నెల్లూరు కిసాన్‌నగర్‌కు చెందిన శివబ్రహ్మంకు బాలక్రిష్ణారెడ్డినగర్‌కి చెందిన పుణ్యవతితో ఐదేళ్లక్రితం వివాహమైంది. కొయ్యపని చేసుకుని జీవించే శివబ్రహ్మం ఏడాది కాలంగా బాలక్రిష్ణారెడ్డినగర్‌లోని సాయిబాబా గుడి సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతోపాటు ఇటీవల మద్యానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ ఉండడాన్ని చూసిన మృతుడి భార్య కేకలు వేసింది. చుట్టుపక్కలవారు శివబ్రహ్మంను కిందకు దించి ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుడికి భార్య పుణ్యవతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడునెలల క్రితం అనారోగ్యంతో చిన్నకుమారుడు మృతి చెందాడు. భర్త, కుమారుడు మృతితో పుణ్యవతి కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్‌ ఎస్‌ఐ వెంకట్రావ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
పవన్‌ కల్యాణ్‌ ఒక రౌడీలా మాట్లాడుతున్నాడు Tue, Apr 23, 2024, 07:52 AM
పవన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు Tue, Apr 23, 2024, 07:51 AM
ఓటర్లను కొనుగోలు చేయవచ్చనే ఆలోచనలు ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బతీస్తాయి Tue, Apr 23, 2024, 07:51 AM
జరిగిన అభివృధి చూపిస్తా, సవాల్ కి సిద్దమేనా..? Tue, Apr 23, 2024, 07:49 AM
నీ ప్యాకేజి రాజకీయాలకోసం ఈరోజు నీ అన్న చిరంజీవిని కూడా రోడ్డుపైకి లాగుతున్నావు Tue, Apr 23, 2024, 07:47 AM