by సూర్య | Sun, Mar 19, 2023, 01:22 PM
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలన్నింటినీ గెలవాల్సిందేనని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ స్పష్టంచేశారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ఎమ్మెల్యేలకు గ్రూపుల వారీగా మాక్ ఓటింగ్‌ను నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డ్డి, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య తదితరులకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా తమ గ్రూపు సభ్యులతో మాక్ ఓటింగ్ చేయించారు. ఈ నెల 21న పూర్తిస్థాయిలో మాక్ ఓటింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.
Latest News