![]() |
![]() |
by సూర్య | Sun, Mar 19, 2023, 01:20 PM
వైకాపా ప్రభుత్వం పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, గెలిచిన తర్వాత 12 గంటలైనా సర్టిఫికెట్ ఇవ్వకపోవడం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్పను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పరువును సర్టిఫికెట్ రూపంలో రాంగోపాల్ రెడ్డి కి ఇస్తున్నారన్నారు. సీఎం జగన్ పద్ధతి మార్చుకుంటే కనీసం ఎమ్మెల్యేగా అయినా ఉంటారన్నారు. గెలిచిన అభ్యర్థిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఎస్పీ ఫకీరప్ప ఉద్యోగానికి పనికిరారని అన్నారు. ఎస్పీ, కలెక్టర్‌పై చర్యలు తీసుకునేవారకూ అసెంబ్లీని స్తంభింపచేస్తామని అశోక్‌బాబు స్పష్టం చేశారు.
Latest News