by సూర్య | Sun, Mar 19, 2023, 12:47 PM
ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహజంగా కమ్యూనిస్టులు, యూనియన్లు యాక్టివ్‌గా ఉంటాయని వైసీపీ నాయకులూ సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ఈ సారి వారంతా తెలుగుదేశానికి మద్దతు పలికినట్లున్నారు. పీడీఎఫ్ లాంటి వేదికలు తెలుగుదేశం పార్టీకి ఓట్లను బదిలీ చేశాయన్నారు. ఈ ఫలితాలను చూసి ఎవరూ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు అందుకున్న ఓటర్లు దీంట్లో పాల్గొనలేదన్నారు. రెండు స్థానాల గెలుపుతోనే శక్తి పెరిగిందని సంబరాలు చేసుకుంటే చేసుకోనివ్వండి అన్నారు.
Latest News