కుంగిన స్కూల్.. విద్యార్థులకు గాయాలు

by సూర్య | Sun, Mar 19, 2023, 12:07 PM

ఓ స్కూల్ లోని తరగతి గది భూమిలోకి కుంగి 17 మంది విద్యార్థులు గాయపడిన ఘటన జింబాబ్వేలో జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజధాని హరారేకు 200 కి.మీ దూరంలోని క్వెక్వేలో ఓ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిలో పెద్దగొయ్యి ఏర్పడి విద్యార్థులు అందులో పడిపోయారు. గాయపడ్డ వారిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. సమీపంలో బంగారు గనుల్లో అక్రమ తవ్వకాల వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

Latest News

 
తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్ Thu, Dec 07, 2023, 09:04 PM
ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్‌ విడుదల Thu, Dec 07, 2023, 08:55 PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు Thu, Dec 07, 2023, 08:38 PM
విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ Thu, Dec 07, 2023, 05:08 PM
తెలంగాణ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు Thu, Dec 07, 2023, 05:07 PM